ఫ్యామిలీ ఆడియెన్స్ కోరుకునే..ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు

49
director
- Advertisement -

వెర్స‌టైల్ హీరో సూర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘ET (ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు)’. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా మార్చి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ లెవల్లో విడుద‌ల అవుతుంది. ప్రియాంక అరుల్ మోహ‌న్ హీరోయిన్‌. సినిమా ట్రైల‌ర్ సినిమా ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత పెంచాయి. సినిమా విడుద‌ల సంద‌ర్భంగా సినిమా గురించి డైరెక్ట‌ర్ పాండిరాజ్ ఇంట‌ర్వ్యూ…

ET (ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు) సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల‌వుతుంది.. డైరెక్ట‌ర్‌గా ఏమైనా టెన్ష‌న్ ఫీల్ అవుతున్నారా?

  • అలాంటిదేమీ లేదండి.. నిజానికి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే.. ముందు మేం ET సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లోనే రూపొందించాల‌ని అనుకున్నాం. కానీ చివ‌రకు నేను ఈ సినిమాలో చెప్పాల‌నుకున్న విష‌యం దేశంలో చాలా చోట్ల మ‌హిళ‌లు ఎదుర్కొంటున్నవే. కాబ‌ట్టి.. సినిమాను మ‌ల‌యాళ, క‌న్న‌డ‌, హిందీల్లోనూ విడుద‌ల చేయాల‌నుకున్నాం. అలా ET పాన్ ఇండియా సినిమా అయ్యింది.

ఇప్ప‌టి వ‌ర‌కు పాండిరాజ్ సినిమా అంటే ఫ్యామిలీ ట‌చ్ ఉంటుందనే భావ‌న ఉంది.. మ‌రి ET సినిమాను కూడా ఆ కోణంలోనే చూడొచ్చా?

  • ఇప్ప‌టి వ‌ర‌కు నేను డైరెక్ట్ చేసిన సినిమాలు చూసిన ప్రేక్ష‌కుల‌కు పాండిరాజ్ సినిమా అంటే ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఎక్కువ‌గా ఉంటాయ‌నే ఆలోచ‌న ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ET సినిమా విష‌యానికి వ‌స్తే ఇందులో ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉండ‌టంతో పాటు.. నా సినిమాల్లో మీరు ఊహించ‌ని విధంగా.. ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని మాస్ ఎలిమెంట్స్‌ను ఈ సినిమాలో చూస్తారు. పాన్ ఇండియా ప్రేక్ష‌కులు ఎలాంటి మాస్ మూవీస్‌ల‌ను చూడాల‌ని కోరుకుంటారో అలాంటి ఎలిమెంట్స్‌ను అన్నింటినీ ఈ సినిమాలో తెర‌కెక్కించాం. యాక్ష‌న్ ఎలిమెంట్స్‌లోనూ ఓ ఎమోష‌న్‌ను జోడించాం. రామ్ ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ అద్భుత‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేశారు.

ETలో ప్ర‌ధానంగా మీరు మ‌హిళ‌ల‌కు సంబంధించి ఏం చెప్ప‌బోతున్నారు?

  • మ‌హిళ‌ల గురించి చెప్పే సినిమా ఇది. ఎనిమిద‌వ త‌ర‌గ‌తి నుంచి పై చ‌దువుకు కాలేజ్ వెళ్లే అమ్మాయిల‌ను ఇంటి నుంచి బ‌య‌ట‌కు పంపేట‌ప్పుడు మ‌న‌సులో ఏదో తెలియ‌ని భ‌యం ఉంటుంది. ఆ అమ్మాయి ఇంటికి వ‌చ్చే వ‌ర‌కు త‌ల్లిదండ్రుల్లో ఓ సంఘ‌ర్ష‌ణ ఉంటుంది. ఓ అమ్మాయి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ఎంత ధైర్యంగా ఉండాలి. అనే విష‌యంతో పాటు ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు ఇంట్లో వాళ్ల‌కి చెప్పకుండా దాచ‌కుండా ధైర్యంగా స‌మ‌స్య‌ను చెప్పేలా ఉండే సినిమా. ఏదో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలా ఎంజాయ్ చేసి చూసి వెళ్లే పోవాల‌నుకునే సినిమా అయితే మాత్రం కాదు. మహిళ‌ల ఎదుర్కొనే స‌మ‌స్య‌కు జ‌వాబును సూచించే సినిమా అని గ‌ట్టిగా చెప్ప‌గ‌ల‌ను.

సూర్య క‌థ విన‌గానే ఏమ‌న్నారు?

  • సూర్య‌గారిని క‌లిసి క‌థ నెరేట్ చేసిన‌ప్పుడు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మ‌నం చెప్పాల్సిన క‌థ ఇదే సార్‌. మెయిన్ కాన్సెప్ట్ సూప‌ర్‌గా ఉంది. నా సినిమా ద్వారా ఈ విష‌యం చెప్పాలనుకున్నందుకు మీకు థాంక్స్ చెప్పాల‌ని అన్నారు సూర్య‌.

ఫ‌స్ట్ కాపీ చూసిన త‌ర్వాత సూర్య రెస్పాన్స్ ఏంటి?

  • ఫ‌స్ట్ కాపీ రెడీ అయిన త‌ర్వాత ఆయ‌న్ని చూడ‌మ‌ని చెప్ప‌గానే.. నాకు కాస్త ఫీవ‌ర్‌గా అనిపిస్తుంది. అదీ కాకుండా మా ఇంట్లో ప‌నిచేసే ఇద్ద‌రు పని వాళ్ల‌కు కూడా పాజిటివ్ అని తేలింది. మీరు పిలిచారు కాబట్టి వ‌స్తాను. దూరంగా కూర్చుని సిన‌మా చూస్తాను అన్నారు. అలా ఆయ‌న మాస్క్ అన్నీ వేసుకుని మిక్సింగ్ థియేట‌ర్‌కు వ‌చ్చి దూరంగా కూర్చుని సినిమా చూశారు. సినిమా పూర్త‌యిన త‌ర్వాత వేగంగా వ‌చ్చి న‌న్ను గ‌ట్టిగా ప‌ట్టుకుని థాంక్యూ సార్‌.. ల‌వ్ యు అని చెప్పారు. సూర్య‌గారికి అంత బాగా న‌చ్చింది. ఇక్క‌డ ఇంకో విష‌యం చెప్పాలి. సూర్య‌గారు సినిమా చూసే స‌మ‌యానికి తెలుగులో డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌ను పెట్టి డ‌బ్బింగ్ చెప్పించేశాం. కానీ ఆయ‌న‌కు చాలా బాగా న‌చ్చ‌డంతో.. మ‌ళ్లీ ఆయ‌నే సొంతంగా డ‌బ్బింగ్ చెప్పాల‌ని నిర్ణ‌యించుకుని.. డ‌బ్బింగ్ చెప్పారు. త‌మిళంలో కంటే తెలుగు డ‌బ్బింగ్ స‌మ‌యంలోనే ఎక్కువ ఎంజాయ్ చేసి మ‌రీ చెప్పారు. అంత బాగా సినిమాలో ఇన్ వాల్వ్ అయ్యారు.

సూర్య‌.. కార్తి ఇద్ద‌రితో సినిమా చేశారు.. వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా అనిపించింది?

  • ఇద్ద‌రూ జెన్యూన్‌గా ఉంటారు. సినిమా బెట‌ర్‌గా రావాలంటే ఏం చేయాల‌ని ఆలోచిస్తుంటారు. డైరెక్ట‌ర్ కంటే సినిమా బాగా రావాల‌ని కోరుకుంటారు. అలాగే ఏ విష‌యాన్ని అయినా చెప్పాల‌నుకున్న‌ప్పుడు నొప్పించ‌కుండా చెప్పాల‌ని కోరుకుంటారు. చుట్టూ ఉన్న వారిని ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకుంటారు.

డైరెక్ట‌ర్‌గా మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి?

  • నాకు ఫ్యామిలీ డైరెక్ట‌ర్ అనే ఇమేజ్ ఉంది. ఇక సూర్య‌గారు అన్నీ ర‌కాలో జోన‌ర్ మూవీస్ చేశారు. ఆయ‌న‌కు మాస్ హీరోగా ఉండే ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఫ్యాన్స్ ఆయ‌న్ని మాస్ యాంగిల్లో చూడాల‌నుకుంటారు. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్‌కు న‌చ్చే ఎమోష‌న్స్‌, ల‌వ్ అన్నీ ఎలిమెంట్స్ ఉండాలి. ఎక్కడా ప్రేక్ష‌కుడు ఇబ్బంది ప‌డే స‌న్నివేశాలు లేకుండా చూసుకోవాలి. ఇలా అన్నీ విష‌యాల‌ను బ్యాలెన్స్ చేస్తూ సినిమా చేసిన‌ప్పుడు అది అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. కాబ‌ట్టి ఓ డైరెక్ట‌ర్‌గా ఆ విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకునే ET సినిమాను అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా మంచి విందు భోజ‌నంలాంటి సినిమాగా రూపొందించాను. ఇలా అన్నీ వ‌ర్గాల‌ను స‌మ‌పాళ్ల‌లో మిక్స్ చేసి సినిమా చేయ‌డం స‌వాలుగా అనిపించింది. త‌దుప‌రి చిత్రాలేంటి?
  • ప్ర‌స్తుతం ET విడుద‌ల కోసం వెయిట్ చేస్తున్నాను. నాలుగైదు పాయింట్స్ అయితే మైండ్‌లో ఉన్నాయి. ET రిలీజ్ త‌ర్వాత నెక్ట్స్ మూవీ గురించి ఆలోచిస్తాను.. అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు డైరెక్ట‌ర్ పాండిరాజ్‌. .
- Advertisement -