- Advertisement -
ఎగ్జిట్ పోల్స్ అన్ని పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడం ఖాయమని జోస్యం చెబుతుండటంతో ఆ పార్టీ నేతల ఆనందానిక అవధుల్లేకుండా పోయాయి.ఈ నేపథ్యంలో ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం అంటే కామన్ మ్యాన్ అని, సీఎం అయినా తాను మాత్రం మామూలు వ్యక్తిలానే ఉంటానని తెలిపారు. సీఎం అయినంత మాత్రానా తన కళ్లు నెత్తికెక్కవు అని తేల్చి చెప్పారు. సీఎం అయినా తన జీవన శైలిలో ఎలాంటి మార్పులూ వుండవని, కొత్త జీవితం వచ్చిందని తాను ఫీల్ కానని అన్నారు.
పంజాబ్‌కు పునర్వైభవం తీసుకొస్తానని, పాత పంజాబ్ తిరిగి రావాలని ప్రజలు కలలు కంటున్నారని, ఆ దిశగానే పనిచేస్తానని తెలిపారు.
- Advertisement -