రాష్ట్రంలో ఇకపై కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరు: సీఎం కేసీఆర్

144
kcr telangana
- Advertisement -

ఇక పై రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండ‌రని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఉద్యోగ నియామ‌క నోటిఫికేష‌న్ల ప్ర‌క‌ట‌నను వెలువరించిన సీఎం తక్షణమే 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 91,142 ఖాళీలను గుర్తించామని ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తున్న‌ట్లు తెలిపారు.

మానవీయ దృక్పథంతో ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించిందన్నారు. అయితే కొన్నిరాజకీయ పార్టీలు సంకుచిత మనస్తత్వంతో కోర్టులో కేసులు వేసిన నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వుల కారణంగా ఈ ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. ప్రభుత్వం పట్టు విడవకుండా న్యాయ పోరాటం చేసింది. ప్రభుత్వ పోరాటం ఫలితంగా గతేడాది డిసెంబరు 7న సంబంధిత రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలను వెలువరించిందన్నారు.

తెలంగాణ ప‌రిధిలోని అన్ని యూనివర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను, 2,774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా రాష్ట్రంలోని నేరుగా నియామకం చేయాల్సిన ఖాళీల సంఖ్య 80,039 ఉన్నట్లు తేలిందని సీఎం తెలిపారు.

- Advertisement -