రాష్ట్రంలో 95 శాతం ఉద్యోగాలు స్ధానికులకే దక్కుతాయన్నారు సీఎం కేసీఆర్. నిరుద్యోగయువతకు సంబంధించి అసెంబ్లీలో కీలక ప్రకటన చేసి సీఎం…మిగిలిన 5శాతంలోనూ3 శాతం స్ధానికులకే ఉద్యోగాలు దక్కుతాయన్నారు. గతంలో నాన్ లోకల్ కోటా 20 శాతం ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. లక్షా 59 వేల ఉద్యోగాలు నోటిఫై చేశామని తెలిపిన సీఎం…లక్షా 29 వేల కొలువులు భర్తీ చేశామన్నారు. అటెండర్ నుండి ఆర్డీవో దాకా 95 శాతం ఉద్యోగాలు మనకే దక్కుతాయన్నారు.
తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్‌గా 1 నిలిచిందన్నారు. ఆనాడు కరెంట్ వస్తే వార్త…ఇవాళ కరెంట్ పోతే వార్త అన్నారు. దేశంలో 24 గంటల పాటు కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పంచాయతీ ఇంకా తెగలేదని…అనేక కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. 9,10 షెడ్యూల్ పంచాయతీ ఇంకా తెగలేదన్నారు. ఉద్యోగ ఫ్రెండ్లీ గవర్నమెంట్ విధానం అవలంభించడం వల్లే అద్భుతాలు సాధించామన్నారు. ఉద్యోగులకు అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. విద్యుత్ డిపార్ట్ మెంట్ లో 22,700 మందిని రెగ్యులైజ్ చేశామన్నారు.