రాజకీయాలంటే పవిత్రమైన టాస్క్‌: సీఎం కేసీఆర్

116
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దేశ చరిత్రలో కీలక ఘట్టం అన్నారు సీఎం కేసీఆర్. ఆనాడు యువత నిరాశతో తుపాకులు పట్టుకుందని…రైతులను పాతాళ లోకానికి సమైక్య పాలకులు తొక్కారన్నారు సీఎం. నిరుద్యోగ యువతకు సంబంధించి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు సీఎం.

నీళ్లు,నిధులు,నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తుచేసిన సీఎం..ప్రజలు దీవించడంతో తెలంగాణ సాకారమైందన్నారు. తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రంలోనే కీలకమని…ప్రజలు ఎన్నో ఆశలతో తమకు అవకాశం ఇచ్చారని ఆ నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తున్నామన్నారు.

ఎన్నో సమస్యలతో నలిగిపోయిన తెలంగాణ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మాకు రాజకీయాలంటే పవిత్రమైన టాస్క్…ప్రజలకు న్యాయం చేయడమే అన్నారు. ఇప్పుడు తెలంగాణ భాష మాట్లాడితేనే హీరో సక్సెస్ అవుతున్నారని తెలిపారు సీఎం. తెలంగాణ భాష, సంస్కృతికి సంబంధించిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారు.

తెలంగాణ కోసం విద్యార్థులు ఉద్యమాలు చేశారని తెలిపారు సీఎం. ఇప్పుడు రాజకీయాల కోసం అడ్డం,పొడుగు మాట్లాడేవారు అనాడు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తు ఉండిపోయారని మండిపడ్డారు.

- Advertisement -