- Advertisement -
ప్రపంచదేశాలను కరోనా గజగజ వణికించిన సంగతి తెలిసిందే. కరోనా థర్డ్ వేవ్ ముప్పు తొలగిపోవడంతో అన్నిదేశాలు ఊపిరిపీల్చుకోగా ఇక ఫోర్త్ వేవ్ పై భయం అక్కర్లేదని ప్రఖ్యాత వైరాలజిస్ట్ డాక్టర్ జాకోబ్ జాన్ తెలిపారు.
పూర్తిగా భిన్నమైన వేరియంట్ వస్తే తప్ప నాలుగో వేవ్ భయం అక్కర్లేదని తెలిపారు. గతంలో వచ్చిన ఇన్ఫ్ల్యూయెంజాలు కూడా రెండు మూడు దశల తర్వాత ముగిశాయన్నారు. దేశం మరోమారు ఎండమిక్ దశకు చేరుకుందన్నారు.
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కి చెందిన వైరాలజీ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్కు డాక్టర్ జాన్ గతంలో డైరెక్టర్గా పనిచేశారు.
- Advertisement -