ఆర్ యూ ఏ వర్జిన్.. అదెప్పుడో పదిహేనేళ్ల క్రితం !

413
- Advertisement -

అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘బాబు చాలా బిజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. హిందీలో సూపర్ హిట్టయిన అడల్ట్ మూవీ ‘హంటర్’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.  సెక్స్ అడిక్ట్‌ యువకుడి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.  మనిషికి ఆకలి, నిద్ర ఎలాగో సెక్స్ కూడా అవసరమే….అది ప్రతి మనిషికి ఫిజికల్ నీడ్ అంటూ తన స్నేహితులతో వాదించేది హీరో క్యారెక్టర్. ఇలాంటి సినిమా తెలుగులో వస్తుండటంతో చర్చనీయాంశం అయింది.

తాజాగా ఈ సినిమా టీజర్ వచ్చేసింది. ఈ టీజర్‌లో ఈ ఐదుగురే ప్రధానంగా కనపడడం విశేషం. ఆర్ యూ ఏ వర్జిన్ అని ఓ యువతి ప్రశ్నించగా.. ‘అదెప్పుడో పదిహేనేళ్ల క్రితం’ అని అవసరాల చెప్పే ఒకేఒక్క డైలాగ్ ఈ టీజర్‌లో ఉంది. మొదటి నుంచే బూతు సినిమా అనిపించుకుంటున్న ఈ చిత్రం.. విడుదల తర్వాత ఇంకెన్ని విమర్శలు ఎదుర్కుంటుందో చూడాలి. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మిస్త్రీ చక్రవర్తి, తేజస్వి, సుప్రియ, యాంకర్ శ్రీముఖి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

- Advertisement -