- Advertisement -
నేటి నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్ధికమంత్రి హరీష్ రావు. ఈ మేరకు ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలకు అమోదనలు తెలిపారు.
శాసనసభ సమావేశాల నిర్వహణ, వివిధ రంగాల్లో సర్కార్ సాధించిన ప్రగతి, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు, ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రజల అవసరాలు తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.
నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 1,200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
- Advertisement -