ఐసీసీ మహిళల వరల్డ్కప్ 2022 లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు సాధించింది. మహిళల ప్రపంచ క్రికెట్ కప్ లో భాగంగా ఆదివారం బే ఓవల్ మైదానంలో భారత్ – పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 245 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందుంచింది. ఇక ఈ ప్రపంచకప్ తో మిథాలీ రాజ్ ఆరు ఓడీఐ వరల్డ్ కప్ లలో పాల్గొన్న ఏకైక భారత మహిళా క్రికెటర్ రికార్డును నమోదు చేసింది. 2000, 2005, 2009, 2013, 2017 ప్రపంచ కప్ లలో మిథాలీ పాల్గొంది. ఈ విషయంలో న్యూజిలాండ్ క్రికెటర్ డెబ్బీ హాక్లే, ఇంగ్లండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ ను వెనక్కి నెట్టింది.
ఇక అత్యధిక ప్రపంచకప్ లలో పాల్గొన్న రెండో భారత క్రికెటర్ గా మిథాలీ గుర్తింపు సంపాదించింది. గతంలో ఒక్క సచిన్ కే ఈ రికార్డు సాధ్యపడింది. సచిన్ టెండుల్కర్ 1992, 1996, 1999, 2003, 2007, 2011 క్రికెట్ కప్ లకు భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఆరు ప్రపంచ కప్ లు ఆడిన వారిలో టెండుల్కర్, పాకిస్థాన్ క్రికెటర్ జావెద్ మియాందాద్ తర్వాత మూడో వ్యక్తి మిథాలీయే కావడం గమనార్హం. ఇక, ఈ మ్యాచులో మిథాలీ 9 పరుగులు చేసి నిరాశపర్చింది. మిథాలీకి దాదాపు ఇదే లాస్ట్ వరల్ట్ కప్. ఈ మెగా టోర్నీ తర్వాత క్రికెట్ కు గుడ్ బై చెప్పనుంది.