సూర్య నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఇటి
(ఎవరికీ తలవంచడు). పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది. తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10 విడుదల కానుంది.
జానీ మాస్టర్ మాట్లాడుతూ, పాండ్య రాజ్ గారు మొదటి సినిమా నుంచి నాకు అవకాశం ఇస్తున్నారు. సాంగ్ కంపోజ్ చేయడం వేరు కెమెరాతో బందించడం గ్రేట్. కెమెరామెన్ రత్నవేల్ చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఇమాన్ ఆకట్టుకునే సంగీతం ఇచ్చారు. నేను చాలా మంది హీరోలను చూశాను. సూర్య జెంటిల్‌మెన్. ఆడపిల్లలకు ఎంతో గౌరవం ఇస్తారు. తోటి ఆర్టిస్టులతో ఎప్పుడూ చనువు తీసుకోవడం నేను చూడలేదు. సూర్య ఎవరు ఏమి చెప్పినా ఓపిగ్గా వింటారు. అది ఆయనలోనిప్రత్యేకత. కొరియోగ్రాఫర్ చెప్పిన బిట్ నేర్చుకోవడమేకాకుండా. ఇంకా మెరుగుదలకుడాన్సర్ నుంచి కూడా గ్రహిస్తారు. భర్త అనేవాడు సూర్యలా వుండాలి. జనూన్ పర్సన్. నేను షూట్‌లో వుండగా సూర్య ఇంటినుంచి భోజనం వచ్చేది. సూర్య అభిమానిగా గజని2
తీయాలని కోరుకుంటున్నాను. హీరోయిన్ ప్రియ చాలా త్వరగా స్టెప్‌లు నేర్చుకునేది. గ్లామర్‌తోపాటు డిసిప్లిన్ వున్న నటి అని తెలిపారు.
2డి ఎంటర్‌టైన్‌మెంట్ రాజశేఖర్ పాండ్యన్ మాట్లాడుతూ, నేను సినిమా చూశాను. సూర్య అభిమానిగా చాలా ఇష్టపడ్డాను. పాండ్యరాజ్ అద్భుతంగా తీశారు. సన్‌టీవీ సంస్థ చక్కటి సినిమా తీశారు. రామ్ లక్ష్మణ్ ఫైట్ ఇంతవరకు తమిళ్‌లో చూడలేదు. అంత బాగా చేశారు. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.వినయ్ రాయ్ మాట్లాడుతూ, సన్ పిక్చర్స్ వండర్‌ఫుల్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సినిమా ఈనెల 10న చూసి ఎంజాయ్ చేయండని పేర్కొన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో ప్రియాంక మోహన్, ఏషియన్ ఫిలింస్ జాన్వీ, అమ్మిరాజు, 2డి ఎంటర్‌టైన్‌మెంట్ రాజశేఖర్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.