- Advertisement -
పవర్ స్టార్ పవన్ – రానా కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. పవన్ సునామీతో నిర్మాతలు లాభాల బాటపట్టగా వెండితెరకు మళ్లీ పూర్వవైభవం వచ్చింది.
తాజాగా ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా కొనుగోలు చేయగా మార్చి ఎండింగ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
మొదటి నుంచి ఈ చిత్రం 40 రోజుల వరకు ఓటిటీ ఎంట్రీ ఇవ్వకూడదని మేకర్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో ఒప్పందం చేసుకున్న సంగతి విదితమే. అందుకే మార్చి నెలాఖరులో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారట.
- Advertisement -