గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న బిగ్ బాస్ ఫేం ప్రియాంక సింగ్..

68
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఓ ఉద్యమంలా దూసుకుపోతుంది. ఇందులో ప్రపంచ నలుమూలల నుండి ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. తాజాగా ఈ ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ లోని జిఎచెంసి పార్క్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ప్రియాంక సింగ్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం జశ్వంత్,సిరి హనుమంతు,షణ్ముక్ ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు ప్రియాంక సింగ్.

- Advertisement -