- Advertisement -
మార్చి 7వ తేదీ (సోమవారం) నుంచి తెలంగాణ రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెల్పేందుకు మార్చి 6వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మార్చి 7వ తేదీన ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సభ ఎన్నిరోజులు జరగాలనేది బిఎసి సమావేశంలో నిర్ణయిస్తారు.
- Advertisement -