టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఏ ఒక్క జానర్‌కు ఫిక్స్ కాకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఆయన ఓ కుటుంబ కథా చిత్రాన్ని చేస్తున్నారు. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అంటూ రాబోతోన్న ఈ మూవీని కిషోర్ తిరుమల తెరకెక్కిస్తోండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ పక్కన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. శర్వానంద్, కిషోర్ తిరుమల ఇద్దరూ కూడా ప్రస్తుతం కొత్త జానర్‌ను ట్రై చేస్తున్నారు.
వచ్చేనెల 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 27వ తేదీన, హైదరాబాద్ .. శిల్పకళావేదికలో నిర్వహిస్తున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది.అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా దర్శకుడు సుకుమార్, హీరోయిన్లు కీర్తి సురేష్, సాయిపల్లవి హాజరు కానున్నారు.
ఈ వేడుకపై కీర్తి సురేశ్ – సాయిపల్లవి ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్లు టాక్. ఈ విషయాన్ని సంబంధించి తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర బృందం. రాధిక, ఖుష్బూ, ఊర్వశి వంటి సీనియర్ నటీమణులు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.