బీజేపీ నేతలకు కాస్త బుర్ర తక్కువ అని తెలుసు కాని…మరీ ఇంత తక్కువ అని ఎవరూ ఊహించరు సుమీ.. కాషాయ పార్టీలో ఆణిముత్యం…మన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలివితేటల గురించి చెప్పనక్కర్లేదు..జీహెచ్‌హెంసీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ట్రిపుల్ రైడింగ్ చేసినా ఛలాన్లు లేకుండా చేస్తా అన్న హామీ దగ్గర నుంచి వరదల్లో కొట్టుకుపోయిన కారుకు కారు, బైకుకు బైకు, గొర్రెకు గొర్రె, బర్రెకు బర్రె ఇస్తామంటూ బండి గారు ఇచ్చిన హామీలు చూసి నగరపౌరులు బిత్తరపోయారు..మరి ఎలా ఇస్తారు అంటే ఏముంది వాటికి ఎలాగూ ఇన్య్సూరెన్స్ ఉంటాయి కదా…వాటి ద్వారా ఇస్తామంటూ వదిలిన ఆణిముత్యంలాంటి డైలాగుతో బండి సంజయ్ మన బ్రహ్మీని మించిన కమేడియన్ అని తెలంగాణ ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఇక బీజేపీ కేంద్ర పెద్దలు కూడా తక్కువేం కాదు…స్వయంగా కేంద్రహోంమంత్రి అమిత్షాగురు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బండిని మించిన డైలాగులు కొట్టారు.
యూత్‌ను ఆకట్టుకోవడానికి పన్నెండో తరగతి పూర్తయి ఇంటర్లో ప్రవేశం పొందే వారికి ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తామని ఇచ్చిన అమిత్‌షా హామీపై సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా పన్నెండో తరగతి పూర్తయి ఇంటర్లో ప్రవేశం పొందే వారికి ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇవ్వడంపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చురకలు వేశారు. ఇంకా నయం ఇంటర్ పూర్తయి పదో తరగతి చదువుతున్నవారికి ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తామనలేదని ఎద్దేవా చేశారు. 11, 12వ తరగతులను కలిపి ఇంటర్మీడియట్ అంటారన్న విషయం అమిత్ షాకు తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందని అఖిలేష్ ఎద్దేవా చేశారు.
ఈమేరకు బహ్రైచ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అఖిలేశ్ మాట్లాడుతూ నాలుగో విడుత పోలింగ్ ముగిసేసరికి సమాజ్‌వాదీ పార్టీకి 200 సీట్లు వస్తాయని తేల్చిచెప్పారు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రైతు సంఘం రాష్ట్రీయ కిసాన్ మంచ్(ఆర్కేఎం) సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మంచ్ జాతీయ అధ్యక్షుడు శేఖర్ దీక్షిత్ ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు బుధవారం లేఖ రాశారు. రైతు సంక్షేమం కోసం అధికార బీజేపీ చేసిందేమీ లేదని, ఈస్టిండియా కంపెనీ ‘విభజించు-పాలించు’ పాలసీని అనుకరిస్తూ మతం పేరుతో ప్రజల్లో విభజన సృష్టించి తిరిగి అధికారం చేపట్టాలని చూస్తుందని విమర్శించారు. మొత్తంగా పన్నెండవ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్లోకి అడుగుపెట్టే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన హామీపై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతోంది. తెలంగాణకు చెందిన నెట్‌జన్లు కూడా మా బండికే బుర్ర తక్కువ అనుకున్నాం…మీకు కూడా అదే సమస్యా అంటూ అమిత్‌షాపై సెటైర్లు వేస్తున్నరు.