- Advertisement -
ఎస్సీ కులాల అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలపై అరణ్య భవన్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్,హరీష్ రావు సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దళితబంధు లబ్ధిదారుల ఎంపికను మరింత వేగవంతం చేసి, మార్చి నెలాఖరు నాటికి గ్రౌండింగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పురోగతిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించాల్సిన అవసరం గురించి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. ఆయా శాఖలు అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికి అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులకు ఆదేశించారు.
- Advertisement -