”మధురిమ”… కమ్ బ్యాక్ !!!

208
madhurima
- Advertisement -

భారత దేశం అనగానే మనకి గుర్తు వచేది లలిత కళలు.అందులొను కుచిపూడి ,భరతనాట్యం ఇవ్వి అంటే ఎనలేని మక్కువ మనకి .ఈ భరత నాట్యన్ని మన దేశం లొ నే కాక దేశ విదేశాలలొ అక్కడ వారు కుడా ఆదరించెలా చేసెవారు కుడా ఉన్నారు.అందులొ ముఖ్యంగా మధురిమ నార్ల కుడా ఒక్కరు .ఆస్ట్రేలియ పార్లమెంట్ మేంబెర్స్ మన మధురిమను అహ్వానించి ఆమే చేసిన సేవకి పురస్కరాన్ని అందించి అభినందించారు .మన దేశం లొనే కాక దేశ విదేశాలలొ ఎన్నొ అవార్డులు రివార్డులు సంపాదించగలిగారు .ఆమే గురించి చెప్పలంటే ఒక నాట్యకారిణిగ ,ఒక లేక్చరర్ గా ,ఒక నౄత్యదర్శకురాలిగా ,అలాగే ఒక నటిమణిగా అన్నిరంగాలలొ అందరిని మెప్పించింది. పుట్టింది మంగళగిరి , పెరిగింది చెన్నై లొ అయిన అచమైన పదహారు అణాల తెలుగింటి అమ్మాయిలా ఉంటారు . సిరివెన్నల సినిమా తొ చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి 420 సినిమాతొ హిరొయిన్ గా మరారు మన మధురిమ. ఒక చెల్లిగా , ఒక భార్య గా ,ఒక క్యరక్టర్ అర్టిస్ట్ గా ,మళ్ళి ఒక పక్క తన నాట్యాని వదలకుండా రెండింటిని బ్యలన్స్ చేస్తు వచ్హారు. సూపర్ స్టార్ కృష్ణ గారి పక్కన బొబ్బిలి దొర అనే సినిమాలో మధురిమ హిరొయిన్ గా నటించారు. అలాగే నందమురి బాలక్రిష్ణ గారికి బొబ్బిలి సింహం , పెద్దన్నయ్య సినిమాలొ చెల్లెలి పాత్రలొ నటించి ప్రేక్షకులను మెప్పించారు .అలానే మనకి ఎప్పటికి గుర్తుండె పాట ఒరేయ్ రిక్షా సినిమాలొ ‘నీ పాదం మీద పుట్టుమచనై చెల్లేమ్మ’ అనే పాటతొ మనకి చలా దగ్గరయ్యారు. ఆ తర్వత మన దేశ సాప్రదాయం అయిన నాట్యన్ని దేశ విదేశాలలొ కుడా చాటి చెప్పలనే ఉద్దేశం తొ సినిమా పరిశ్రమకి దూరం అయ్యరు. తాను అనుకున్న లక్ష్యం నేరవేర్చుకొని తనలాగే ఎంతొమందికి ఈ నాట్యాన్ని నేర్పించి మళ్లి ఇప్పుడు శతమానం భవతి సినిమా తొ తెలుగు పరిశ్రమలొకి అడుగుపెట్టరు.

ప్రస్తుతం మధురిమ సమంత నటిస్తోన్న యశోద చిత్రంలో ఒక మంచి పాత్రలో ప్రేక్షకులను అలరించబోతున్నారు. అలాగే రాజ్ తరుణ్ నటించిన స్టాండప్ రాహుల్ సినిమాలో మరో విలక్షణ పాత్రలో నటించింది. త్వరలో ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో మధురిమ తెలియజేయనున్నారు. ఈ అడుగులు అలా ముందుకు సాగలని, మధురిమ మరిన్ని సినిమాల్లో నటించి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చెయ్యాలని మనమందరం ఆకాంక్షిదాం.

- Advertisement -