- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో దాదాపు 10వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన సర్కార్ వాటికి నోటఫికేషన్ విడుదల చేయనుంది. కొత్త జోనల్ విధానంపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వీటిని భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణలో మొత్తం 970 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో అడ్మినిస్ట్రేటివ్ పోస్టులతో పాటు ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో అదనంగా గుర్తించిన బోధన సిబ్బంది పోస్టులన్నీ కలిపి పది వేలకుపైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటి భర్తీ కోసం ఇప్పటికే ప్రభుత్వానికి సొసైటీలు ప్రతిపాదనలు పంపాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్లు ఇవ్వనున్నాయి.
- Advertisement -