సోమవారం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణ ఖేడ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. 14 ఏళ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. ప్రజలిచ్చిన శక్తితోనే నేనిలా నిలబడ్డానని చెప్పారు. భూపాల్‌రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత నారాయణఖేడ్‌కు జరుగుతున్న సేవ, హరీశ్‌రావు మంత్రిగా ఉండి భూపాల్‌రెడ్డిని గెలిపించిన సందర్భంలో ఇక్కడ చేసిన సేవ ఇన్ని రోజులైనా చిమ్నిబాయిని గుర్తుంచుకొని పిలిపించడం సంతోషంగా ఉంది. గతంలో రవాణా మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో తిరిగాను. సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్‌చెరు, ఆందోల్ పర్యటించాను. గల్లీ గల్లీలో పాదయాతలు కూడా చేశారు. అక్కడే వారం పది రోజులు ఉండి జిల్లా అధికారులు, కలెక్టర్లను వెంటపెట్టుకొని రేగుడు, రాయికోడు, కంగ్టి, న్యాల్కల్ మండలాలు వరుస పెట్టి తిరిగాం. కొన్ని కొన్ని పనులు చేయగలిగాం అన్నారు.
చాలా విచిత్రమైన పరిస్థితి ఉండేది. బుగ్గరామన్న చెరువు, గంగ కత్వా చెరువు ఉండేది. జహీరాబాద్ నియోజకవర్గంలో ఏడుకుల చెరువులు గందరగోళమైనప్పుడు లక్ష్మారెడ్డి, అప్పటి ఎమ్మెల్యే భాగన్న, గోవర్ధన్‌రెడ్డి తనను తీసుకెళ్లి.. ఇవన్నీ బాగు కావాలని ఎంతో కొంత ప్రయత్నం చేశాం. చాలా బాధ కలిగిలేది. అవని చూసి అవగాహన అయిన తర్వాత.. మొత్తం తెలంగాణ వెనుకబడేయిబడినట్లు ఉంది కాబట్టి.. తెలంగాణ రాష్ట్రం అయితే తప్ప ఇది బాగుపడది నిర్ణయానికి వచ్చి.. మీ అందరి దీవెన, సహకారంతో యుద్ధం చేశామన్నారు.
14 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత ఆమరణ దీక్ష పట్టి చావు అంచు వరకు పోతే అప్పుడు తెలంగాణ ఇస్తమని ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ మోసం జరిగింది. మళ్లీ అందరం కలిసి కొట్లాడం. సంగారెడ్డి, జహీరాబాద్, ఆంధోల్ ప్రాంతం కూడా ఉద్యమంలో ముందుకు ఊరిగింది. బ్రహ్మాండంగా పట్టుబట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ ఏర్పడే ముందు ఎన్నో బద్నాంలు పెట్టారు. అపనమ్మకాలు కలిగించారు. మీకు కరెంటు రాదు.. చీకటి ఉంటది.. పరిశ్రమలు మొత్తం తరలిపోతయ్.. పరిపాలన చేతకు మీకు అని మాట్లాడింన్రు. ఎవరైనా ఈ మాటలు మాట్లాడారో వాళ్ల దగ్గర కరెంటు లేదు.
మన తెలంగాణ ఇవాళ 24 గంటల కరెంటు ఉన్నది.. మీ అందరికీ తెలుసు. 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇచ్చే రాష్ట్రం దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇదంతా మీరిచ్చిన బలం, మీ దీవెన బలం. కరెంటే కాదు, మంచినీళ్ల శాశ్వతంగా బాధ పోయింది. రూ.2వేల పింఛన్ ఇచ్చే రాష్ట్రం లేదు ఇండియాలో. ఇవాళ వృద్ధులంతా చాలా గౌరవంగా ఉన్నరు. కోడళ్లు మునుపు వాళ్లను సరిగా చూసుకోకపోయేది. ఇప్పుడు అత్తా రా.. అవ్వా రా అని తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. గ్రామాల్లో ఒక ధీమా వచ్చింది. పేదలకు ఇబ్బంది లేకుండా బియ్యం ఇచ్చేది పెంచుకున్నాం. పెన్షలు ఇచ్చుకుంటున్నాం. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.