- Advertisement -
ఈ సారి ఎండలు దంచికొట్టనున్నాయి. మార్చి మొదటి వారం నుండే భానుడు ప్రతాపం చూపించనున్నాడు. ఈ విషయాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరిగిందని తెలిపింది.
హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదు కాగా గరిష్టంగా 33-34 డిగ్రీలకు చేరుకుంది. ఇక మార్చి మొదటి వారం నుంచే దేశంలో ఎండల తీవ్రత పెరగనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయని అంచనా వేసింది.
- Advertisement -