తాజ్‌మహల్‌ వద్ద రకుల్ సందడి..

128
rakul
- Advertisement -

టాలీవుడ్,బాలీవుడ్,కోలీవుడ్ ఇలా ఇండస్ట్రీ ఏదైనా వరుస సినిమాలతో అలరిస్తోంది అందాల భామ రకులు. తాజాగా ప్రేమ కట్టడం తాజ్ మహల్‌ను తన ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి సందర్శించి సందడి చేసింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దే దే ప్యార్ దే దర్శకుడు లవ్ రంజన్ వివాహానికి హాజరయ్యేందుకు ఈ జంట ఆగ్రాకు వెళ్లారు. పెళ్ళికి హాజరయి ఆ తర్వాత తాజ్ మహల్, ఆగ్రాలోని మరి కొన్ని పర్యాటక ప్రదేశాలని కూడా సందర్శించారు.

జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న సమాచారాన్ని తానే సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది రకుల్ . అయితే పెళ్ళికి ఇంకా టైం ఉందని తెలిపిన రకుల్.. డిన్నర్‌ డేట్‌లు, పార్టీలతో రచ్చ చేస్తున్నారు.

- Advertisement -