ఉక్రెయిన్‌కు విమాన సర్వీసులు నిలిపివేత..

68
Ukraine
- Advertisement -

రష్యా – ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొనడమే కాదు ఏ క్షణమైన యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశం ఉండటంతో జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా ఉక్రెయిన్‌కు తమ సర్వీసులు ఆపేశామని ప్రకటించింది. ఆ దేశ రాజధాని కీవ్‌తో పోర్టు సిటీ ఒడిసా కూడా నేటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

ఇక ఇప్పటికే డచ్ ఎయిర్‌లైన్స్ కేఎల్ఎం కూడా గత వారమే కీవ్‌కు విమాన సర్వీసులను నిలిపివేసింది. దీంతో రెండు సంస్థలు ఉక్రెయిన్ సంక్షోభంతో ముందు జాగ్రత్త పడ్డాయి. ఇక భారత్ కూడా తమ దేశస్తులను వీలైనం త్వరగా వెనక్కిరావాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది.

తాము ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు మొగ్గు చూపుతామని అన్నారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ. ప్రస్తుతం తాము త్రైపాక్షిక సమావేశానికి మద్దతు ఇవ్వడమే కాక ఘర్షణ లేని పాలనను తక్షణమే అమలు చేస్తామని వెల్లడించారు.

- Advertisement -