సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్‌కు నేడు సీఎం కేసీఆర్ భూమిపూజ

45
kcr
- Advertisement -

ఇవాళ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రూ.4,427 కోట్లతో నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగసభలో ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలతో సంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టులో కలపడంతో జిల్లా ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయని తెలిపారు.

మల్లన్నసాగర్‌ నుంచి సింగూరుకు జలాల ను తరలించే ప్రక్రియను చేపట్టారని…. అక్కడి నుంచి సంగారెడ్డి, జహీరాబాద్‌, అందోలు, నారాయణఖేడ్‌ నియోజకవర్గాలకు నీటిని అందించేందుకు సంగమేశ్వర, బసవేశ్వర పథకాలను మంజూరుచేశారని తెలిపారు హరీష్‌.

- Advertisement -