సిరిని నిందించకండి: షణ్ముఖ్‌

145
shanmukh
- Advertisement -

ఎట్టకేలకు బ్రేకప్ పై స్పందించారు బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్‌. ఓ యూ ట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడిన షణ్ముఖ్..తన బ్రేకప్‌తో సిరికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. వారు ఇప్పటికీ మంచి స్నేహితులుగా ఉన్నారట. అయితే బిగ్ బాస్ ద్వారా తనకు వచ్చిన విపరీతమైన ప్రతికూలతతో షన్ను కలత చెందాడని వెల్లడించారు. తన లవ్‌కి బ్రేకప్ పడటానికి సిరికి సంబంధం లేదని.. సిరిని నిందించవద్దని ప్రజలను అభ్యర్థించాడు. తప్పు తనవైపే ఉందని ఒప్పుకున్నాడు.

దీప్తి కూడా ప్రతికూలతలను ఎదుర్కోవలసి వచ్చిందని…సిరి విషయంలో తన రిలేషన్ గురించిన అంచనాలు తలక్రిందులయ్యాయని చెప్పుకొచ్చాడు. ప్యాచ్-అప్‌కు ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అని అడిగినప్పుడు… అదంతా విధిపై ఆధారపడి ఉంటుందని షన్ను చెప్పాడు.

- Advertisement -