యాప్‌లపై నిషేధం..స్పందించిన చైనా

104
china
- Advertisement -

భారత్ – చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా 54 చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా స్పందించింది. చైనా సంస్థలతో సహా విదేశీ పెట్టుబడిదారులందరి పట్ల భారత్ ఒకే రీతిలో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొంది.

కొందరిపైనే వివక్ష చూపించడం తగదని, పారదర్శక రీతిలో, సరైన పంథా అనుసరించాలని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి గావో ఫెంగ్ హితవు పలికారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతం, వ్యాపార సహకారం కొరకు భారత్ దృఢమైన విధానం అవలంభిస్తుందని భావిస్తున్నామని తెలిపారు.

- Advertisement -