టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో విబేధాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీభవన్‌కు , పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కాగా భువనగిరి, యాదాద్రిలో పర్యటించిన టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌తో కలిసి కోమటిరెడ్డి పలు అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, కోమటిరెడ్డిని కౌగిలించుకోవడం, నవ్వుతూ ఆప్యాయంగా కబుర్లు చెప్పుకోవడం కాంగ్రెస్ వర్గాలకు షాకింగ్‌గా మారింది. అప్పటికే సీఎం కేసీఆర్ జనగామ, యాదాద్రి పర్యటనలను అడ్డుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చాడు. అయితే కోమటిరెడ్డి వెంటకరెడ్డి మాత్రం స్థానిక ఎంపీగా ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
జనగామ కలెక్టరేట్ భవనం చూసి ఆశ్చర్యపోయిన కోమటిరెడ్డి…దేశంలోని రాష్ట్రాల సచివాలయాలు కూడా ఇలా లేవు..సీఎం కేసీఆర్ భేష్..కరోనా కాలంలోను సంక్షేమ పథకాలను కొనసాగించారని ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాకుండా ఆయనపై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన కోమటిరెడ్డిపై రేవంత్ వర్గం కారాలు మిరియాలు నూరుతుంది. కాగా కేసీఆర్‌తో మనం యుద్ధం చేస్తుంటే సీనియర్ నేత అయి ఉండి..ఆ కౌగిలింతలేంటీ, ఆ ముచ్చట్లేంటీ, ఆ పొగడ్తలేంటని రేవంత్ వర్గం మండిపడుతుందంట.. తాజాగా గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ సమక్షంలో పీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ వర్గం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఊహించని షాక్ ఇచ్చింది. సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కైన ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై హైకమాండ్ కు పీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ పిర్యాదు చేసారు. సోనియాకు రాసిన ఫిర్యాదు లేఖను మాణిక్యం ఠాగూర్, రేవంత్ రెడ్డి, చిన్నా రెడ్డి లకు అందజేసారు.. సీఎం కేసీఆర్ తో ఎంపి కోమటిరెడ్డి సన్నిహితంగా మెలగడంపై సోనియా గాంధీకీ పిర్యాదు చేశారు.
ఉత్తమ్‌కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకనే కాంగ్రెస్ లో కొందరు అధికార పార్టీ తో అంటగాగుతున్నారని ఆరోపించారు. ముఖ్యనేతలు ఇలా టీఆరెఎస్ పార్టీతో సన్నిహితంగా ఉండటం పార్టీకి నష్టమని ఆ లేఖలో వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పై చేస్తున్న పోరాటం ఇలాంటి నేతల వల్ల నీరు గారుతోందని అగ్రహించారు. తక్షణం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ హైకమాండ్‌ను డిమాండ్ చేశారు అయితే కోమటిరెడ్డిని కాంగ్రెస్ నుంచి వెళ్లగొట్టాలన్న రేవంత్ వర్గం ప్రయత్నాలు సఫలమవుతాయా…కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి విధేయుడిని, ఉద్యమనేతను వదులుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకుందా..అనేది చూడాలి. కాగా కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోమని తన వర్గంతో హైకమాండ్‌కు లేఖ రాయించిన మరునాడే రేవంత్ రెడ్డి స్వయగంా కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో నవ్వుతూ ఫోటోలు దిగడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది..పైకి నవ్వులు…లోలోపల కత్తులు..కాంగ్రెస్‌లో నేతల రాజకీయం వేరప్పా అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది