- Advertisement -
దేశంలోనే అత్యధిక పంటలు పండే రాష్ట్రం తెలంగాణ అన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్ర ఏర్పాటుకోసమే జన్మించిన నేత సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో వ్యతిరేక శక్తులు తెలంగాణ రాదన్నా, ఆత్మవిశ్వాసంతో మేధావి వర్గాన్ని ఏకం చేసి నడిపంచారని గుర్తు చేశారు.
కరువుతో అల్లాడుతున్న రాష్ట్రానికి గోదావరి, కృష్ణ జలాలతో కోటి ఎకరాలకు నీళ్లు అందించి, దేశంలోనే అత్యధిక పంటలు పండే రాష్ట్రంగా తయారు చేశామన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్3 ద్వారా ఉన్న వెసులుబాటు ద్వారా రాష్ట సిద్ధి కోసం కొట్లాడి.. అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి రాష్ర్టాన్ని సాధించకునేలా చేశామన్నారు.
- Advertisement -