- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఈరోజు నటరాజ్ మాస్టర్ జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ.. పర్యవరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు.
ప్రతి ఒక్కరు వీలైనన్ని మొక్కలు నాటాలి అని తద్వారా మంచి ఆక్సిజన్ పొందుతామని అన్నారు. రాబోయే తరాలకు చెట్ల ఉపయోగాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం లోబో,తనుజా,ఉమ ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు నటరాజ్ మాస్టర్.
- Advertisement -