ఓ మై ఆధ్య సాంగ్‌.. రష్మిక అందాలకు ఫిదా అవ్వాల్సిందే..

96
- Advertisement -

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ప్ర‌తి ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు విశేష స్పంద‌న‌ ల‌భించింది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అవ్వడంతో ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమా బజ్‌ను మ‌రింత‌ పెంచడానికి సహాయపడుతోంది. ఇప్ప‌టికే సినిమా ఫస్ట్‌, టైటిల్‌ ట్రాక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేమికుల రోజున రెండో పాట‌గా పెప్పీ అండ్ బ్రీజీ మెలోడీ ఓ ఆధ్య పాటను విడుదల చేశారు. ఈ పాట‌లో దేవి శ్రీ ప్రసాద్ కొన్ని ఫుట్ ట్యాపింగ్ సౌండ్‌లను అందించారు. హీరోహీరోయిన్లు వారి డ్యాన్స్ స్కిల్స్ ప్రదర్శించడానికి తగినంత స్కోప్ పాట‌లో ఉంది. గిటార్ స్టెప్ మ‌రింత‌ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ పాటను యాజిన్ నిజార్ చక్కగా ఆలపించారు. శ్రీమణి మంచి సాహిత్యం అందించారు.

ఈ పాటలో శర్వానంద్ స్టైలిష్‌గా కనిపించగా, రష్మిక మందన్న గ్లామర్‌గా కనిపించింది. ఈ పాట యూత్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్‌ క‌లిసి న‌టిస్తుండ‌డం ఈ సినిమాలో మ‌రో విశేషం.సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు

సాంకేతిక బృందం
దర్శకత్వం: తిరుమల కిషోర్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
సంగీతం, దేవీ శ్రీ ప్రసాద్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
కొరియోగ్రఫర్: దినేష్
పీఆర్వో: వంశీ-శేఖర్

- Advertisement -