ఆయూష్‌ విభాగానికి ప్రభుత్వం పెద్దపీట- మంత్రి హరీష్‌

71
- Advertisement -

ప్రజల్లో చైతన్యం కల్పించి, నమ్మకం, విశ్వాసాన్ని కలిగించి ప్రజా ఆదరణ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అలా పొందేలా ఆయూష్, యునాని వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు హితవు పలికారు. ఈరోజు ఆయన సిద్దిపేట పట్టణంలో ఆయూష్ ఆధ్వర్యంలో ఉచిత యునాని మెగా వైద్య శిబిరం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యునానీ మందులు ప్రకృతి నుంచి తయారు చేసినవి, ఆయూష్‌ విభాగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని, కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.

ఫిబ్రవరి 11వ తేదీ జాతీయ యునాని దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయూష్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. యునాని వైద్యం ఒకప్పుడు ప్రముఖంగా ఉండేది, కొత్త ఆధునిక వైద్య సదుపాయాలు రావడంతో కొద్దిగా వెనుక ఉన్నట్లు చూస్తాము, ఛార్మీనార్ యునాని ఆసుపత్రికి పక్క రాష్ట్రాల నుంచి రోగులు వచ్చి తమ దీర్ఘకాలిక రోగం నయం చేసుకుని వెళ్తారు. దీర్ఘకాలిక వ్యాధులకు, శారీరక, మానసిక వ్యాధులకు, కీళ్ల నొప్పులు, జీర్ణ కోశ, షుగర్, పక్ష వాతం, ఎలర్జీ, ఆస్తమా, తదితర వ్యాధులకు ఏలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం ఒక్క యునానీలోనే అందుబాటులో ఉన్నది, అనుభవజ్ఞులైన యునాని వైద్యులు ఉచితంగా చికిత్స చేసి మందులు అందిస్తున్నారు.

యునాని గ్రీకు దేశంలో పుట్టి, నిజాం పరిపాలనతో ప్రాచుర్యంలోకి వచ్చి, 4, 5 రకాలుగా ప్రజలకు వైద్యం అందిస్తున్నట్లు, వాటిలో హోమియోపతి, నాచురోపతి, అల్లోపతి, ఆయుర్వేద, యునాని ద్వారా సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో హోమియో, ఆయుర్వేద, యునాని, నాచురోపతిలో మెడికల్ కళాశాలలు నడుపుతున్నట్లు.. రేపటి తరాలకు ఆయూష్ వైద్య సేవలు ఉండేలా.. బలోపేతం దిశగా సీఎం కేసీఆర్ నిర్ణయించి కృషి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయూష్ విభాగం కింద హెల్త్ వెల్ నెస్ సెంటర్లు ఉన్నాయి, వీటి అభివృద్ధి కై ఒక్కో వెల్ నెస్ సెంటరుకు రూ. 6 లక్షల 80 వేల రూపాయల చొప్పున రూ. 29 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. హెల్త్ వెల్ నెస్ కేంద్రాలు ప్రజలకు ఉపయోగపడేలా విరివిగా వినియోగంలో తేవాలి. యునాని ఆయూష్ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణం, తొగుట, మిరుదొడ్డిలో మూడు సెంటర్లు ఉన్నాయి, సిద్దిపేట జిల్లాలో 30 వరకూ యునాని ఆసుపత్రులు ఉన్నాయి, వాటిలో ఓపీ పెరిగేలా సమయపాలన పాటించాలని ఆయూష్ వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు.

- Advertisement -