- Advertisement -
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు ఎంతో ఇష్ట దైవమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన కొనాయపల్లి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. వేకువ జామునే పట్టు వస్త్రాలు ధరించి ఇష్ట దైవమైన కొనాయపల్లి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంకు విచ్చేశారు హరీష్.
పండుగ వాతావరణంలో జరిగిన ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా వేద పండితుల సమక్షంలో జరిగిన హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- Advertisement -