దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, తమిళ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ భారీ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్నఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో ఆసక్తికరమైన కథతో రూపొందుతోంది. చరణ్‌కు ఇది 15వ చిత్రం కాగా.. దిల్ రాజు బ్యానర్‌లో ఇది 50వ చిత్రం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సునీల్, శ్రీకాంత్, మలయాళ స్టార్ జయరాం ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో చరణ్ తన డ్యూయల్ లుక్ తో డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడనే టాక్ నడుస్తోంది. రెండు విభిన్నమైన లుక్స్ లో.. క్లీన్ షేవ్ తో మిస్టర్ పర్ఫెక్ట్ లా, ఇక లేలేత మీసాలు, గడ్డంతో మరో లుక్ లో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడట.
RC15…2023 పొంగల్ సందర్భంగా తెరపైకి రానుంది. కాబట్టి మేకర్స్ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.