భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగశాల నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ లాంచ్ విజయవంతం అయింది. మూడు ఉపగ్రహాలతో కూడిన పోలార్ లాంచ్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ52 సోమవారం తెల్లవారు జామున 5.59 నిముషలకు నింగిలోకి దూసుకెళ్లింది.
ఆదివారం తెల్లవారు జామున 4.29 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్.. 25.30 గంటల పాటు నిరాటంకంగా కొనసాగిసోమవారం తెల్లవారు జామున విజయవంతంగా ముగిసింది.ఈ శాటిలైట్ ద్వారా వ్యవసాయ, అటవీ, నీటి వనరుల సమాచారం సేకరించనున్నారు. ఆర్ఐశాట్ (ఈవోఎస్ -04)గా పిలిచే ఈ ఉపగ్రహం పదేళ్ల పాటు సేవలు అందించనుంది.
ఐఎన్ఎస్-2టీడీ: 17.50 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భారత్, భూటాన్ శాస్త్రవేత్తలు కలిసి రూపొందించారు. ఇస్రో నూతన చైర్మన్ సోమనాథన్ ఆధ్వర్యంలో చేపట్టిన మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఇది.