లివింగ్ స్టోన్ @ రూ. 11.50 కోట్లు

177
living stone
- Advertisement -

ఐపీఎల్ రెండోరోజు వేలంలో భాగంగా రికార్డు ధరకు అమ్ముడుపోయాడు ఇంగ్లండ్‌కు చెందిన ఆల్ రౌండ‌ర్ లియామ్ లివింగ్‌స్టోన్. అతడి బేసిక్ ప్రైజ్ రూ. కోటి ఉండగా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ లివింగ్ స్టోన్‌ను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. ఏకంగా రూ.11.50 కోట్ల‌ను వెచ్చించింది. పొట్టి క్రికెట్‌లో తన సత్తాచాటాడు లివింగ్ స్టోన్.అందుకే ఈసారి ఐపీఎల్ వేలంలో అత‌నికి భారీ డిమాండ్ ఏర్ప‌డింది.

లివింగ్ స్టోన్ కోసం జ‌రిగిన బిడ్డింగ్‌లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీతో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ పోటీప‌డింది. మ‌ధ్యలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కూడా పోటీకి వ‌చ్చి ఆ త‌ర్వాత త‌ప్పుకుంది.ఇక అజింక్య ర‌హానేను అత‌ని బేస్ ప్రైజ్ అయిన కోటి రూపాయ‌ల‌కు కోల్‌క‌తా నైట్ రౌడ‌ర్స్ యాజ‌మాన్యం కొనుగోలు చేసింది. ఇయాన్ మోర్గాన్‌, అరోన్ ఫించ్‌, ఛ‌టేశ్వ‌ర్ పుజారాల‌ను ఎవ‌రూ కొనుగోలు చేయ‌లేదు.

- Advertisement -