- Advertisement -
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం కానుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుండగా ఈనెల 8న జరిగిన సమావేశంలో కమిటీ ఏర్పాటు చేసింది.
కమిటీలో సభ్యులుగా ఏపీ నుంచి ఎస్.ఎస్.రావత్,తెలంగాణ నుంచి రామకృష్ణారావు ఉన్నారు. ఈనెల 17న ఉదయం 11 గం.కు కమిటీ తొలి భేటీ కానుంద. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరగనుండగా రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఏ అంశాలు చర్చించాలన్న దానిపై అధికారులకు కేంద్ర హోంశాఖ సమాచారం ఇచ్చింది.
షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన, ఆస్తుల పంపకాలపై చర్చించడంతో పాటు ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థికపరమైన అంశాలపై చర్చ జరగనుంది.
- Advertisement -