ఎఫ్‌ఐఆర్‌పై మజ్లిస్ అభ్యంతరం..

86
fir
- Advertisement -

విష్ణు విశాల్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ఎఫ్‌ఐఆర్. ఈ సినిమాపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది ఐంఐఎం పార్టీ. ఎం.ఐ.ఎం. పార్టీ యాకత్ పురా శాసన సభ్యుడు, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అహ్మద్ పాషా ఖద్రీ సైతం ఈ విషయమై తమ అభ్యంతరాలను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు లేఖ ద్వారా తెలియచేశారు.

ఎఫ్.ఐ.ఆర్ మూవీ పోస్టర్ పై అరబిక్ భాషలో ఉన్న ‘షహద’ అనే పదం ఇస్లాం మతానికి చెందిందని, అది ఇస్లాం మతానికి సంబంధించిన కీలకమైన అంశమని దానిని పోస్టర్ పై ప్రచురించడం ద్వారా ముస్లింల మనోభావాలను దెబ్బ తీశారని ఆ లేఖలో పేర్కొన్నారు. అలానే తెలంగాణ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 లోని సెక్షన్ 8 ప్రకారం ఇందులో ముస్లిం మతానికి సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని, సినిమాతో పాటు ప్రమోషనల్ వీడియోస్ నుండి వాటిని వెంటనే తీసివేయాలని కోరారు.

వాటి ద్వారా సమాజంలో సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ ఇప్పటికే సినిమా రూపకల్పన విషయంలో తమకు ఎలాంటి దురుద్దేశాలూ లేవని, దేశభక్తి పేరితంగానే ఈ చిత్రాన్ని తీశామని, అయినా ముస్లింలు ఒకవేళ తమ మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే వారికి క్షమాపణలు చెబుతున్నామని ఓ ప్రకటన విడుదల చేసింది.

- Advertisement -