తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

51
- Advertisement -

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో కిషన్ రెడ్డికి వేదాశీర్వచనం అందించారు వేద పండితులు. శ్రీవారి దర్శనం అనంతరం కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు..శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉంది.. టిటిడి ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్ళుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సమాజిక కార్యక్రమాలు చేస్తోంది అన్నారు.

పేదలకు వైద్య,విద్యా, అనేక సామాజిక బస్తీల్లో దేవాలయ నిర్మాణం, దేవాలయాల అభివృద్ధికి టిటిడి సహకరిస్తుంది. జమ్మూలో కూడా టిటిడి దేవస్ధానం ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతుంది. గోవుల ఆధారంగా అనేక రకాల ఉత్పత్తులు చేపట్టడం,గోవుల సంరక్షణకు టిటిడి చర్యలు చేపడుతుంది. టిటిడి చర్యల కారణంగా ప్రజలు కూడా గోవు అంటే రక్షణ భావం ఏర్పడిందన్నారు.

కరోనా కారణంగా టూరిజం వ్యవస్ధ బాగా నష్ట పోయింది. మళ్ళీ పుంజుకుంటున్న సమయంలో‌ ధర్డ్ వేవ్ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి భారత దేశంలో పర్యాటక ప్రదేశాలు అభివృద్ధికి రూపకల్పన చేసింది. అనేక రకాల టూరిజం అభివృద్ధికి కార్యక్రమాలు చేపడుతున్నాం..దేశంలో‌ కరోనా తగ్గు ముఖం‌ పడుతున్న నేపధ్యంలో డెమోస్టిక్ టూరిజం‌ గానీ, ఇంటర్నేషనల్ టూరిజం గానీ పునరుద్దరణ చేస్తాం. దేశంలో 15 ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ప్రతి ఒక్కరు పర్యటించాలని ప్రధాని‌ పిలుపునిచ్చారని కిషన్‌ రెడ్డి తెలిపారు.

- Advertisement -