శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ్మ‌స్వామిని ద‌ర్శించుకున్న సీఎం కేసీఆర్‌..

154
- Advertisement -

సీఎం కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు సీఎం పూర్ణకుంభ స్వాగతం పలికారు. అంతకుముందు కేసీఆర్ మూడు నిమిషాల పాటు ఏరియ‌ల్ వ్యూ ద్వారా ఆల‌యం, యాగ‌స్థ‌లాన్ని ప‌రిశీలించారు. ప్ర‌ధానాల‌యం, కోనేరు, రోడ్ల‌ను కేసీఆర్ ప‌రిశీలించారు. అనంత‌రం కాలిన‌డ‌క‌న ఆల‌యం చుట్టూ తిరిగి ప‌లు సూచ‌న‌లు చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత‌, టీఆర్ఎస్ నాయ‌కులు మోత్కుప‌ల్లి న‌ర్సింహులుతో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు. మార్చి 28న మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ దృష్ట్యా.. సుద‌ర్శ‌న యాగం, ఇత‌ర ఏర్పాట్ల‌పై ఆల‌య పండితులు, అధికారుల‌తో కేసీఆర్ స‌మీక్షించి, ప‌లు సూచ‌నలు చేశారు.

- Advertisement -