రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు @6వ రోజు

77
utsavalu
- Advertisement -

రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల కార్యక్రమాలు 6వ రోజుకు చేరాయి. ఉదయం 6.30 కి అష్టాక్షరీ మంత్ర పఠనం చేయగా ఉదయం 8.30 కి శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞ హోమం జరిగింది. ఉదయం 9 గంటలకు దివ్య దేశాల్లోని 26 ఉత్సవ మూర్తులకు ప్రాణ ప్రతిష్ట.. ఈ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామి యాగ శాల నుంచి ఋత్విజులతో కలిసి ర్యాలీగా వెళ్లనున్నారు.

ఉదయం 10 గంటలకు ఇష్ఠి శాలలో ‌దృష్టి దోష నివారణకు వైయ్యూహికేష్టి యాగం నిర్వహించనున్నారు. 10.30 కి ప్రవచన మండపంలో శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ చేయనున్నారు. మధ్యాహ్నం 12.30కి పూర్ణాహుతి నిర్వహించనుండగా సాయంత్రం 5 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞ హోమం జరుగనుంది. సాయంత్రం 5 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉత్సవాల్లో పాల్గొననుండగా రాత్రి 9 గంటలకు పూర్ణాహుతి జరుగనుంది.

- Advertisement -