- Advertisement -
భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా కుటుంబంలో విషాదం నెలకొంది. సురేష్ రైనా తండ్రి త్రిలోక్ చంద్ రైనా అనారోగ్యంతో మృతి చెందారు. త్రిలోక్ చంద్ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో తమ సొంత నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. త్రిలోక్ చంద్ గతంలో భారత సైన్యంలో ఆర్డినెన్స్ విభాగంలో పనిచేశారు. ఆయన బాంబులు తయారుచేయడంలో సిద్ధహస్తుడు. ఇక రైనా తండ్రి మృతి పట్ల పలువు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
- Advertisement -