- Advertisement -
రానా హీరోగా బ్రిటిష్ పాలన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 1945. దర్శకుడు సత్యశివతో రానాకి విభేదాలు ఏర్పడటంతో క్లైమాక్స్ చిత్రీకరణ జరగలేదు. క్లైమాక్స్ లేకుండానే జనవరి 7న సినిమా రిలీజ్ కాగా ఈ సినిమాకి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు రానా.
అయితే తాజాగా సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 7న ఓటీటీలో రిలీజ్ అవ్వనుంది. సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. మరి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులని ఎలా అలరిస్తుందో చూడాలి.
- Advertisement -