ముచ్చింతలకు ప్రధాని..సమతామూర్తి విగ్రహాం జాతికి అంకితం

75
modi pm
- Advertisement -

ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణకు రానున్నారు. ముచ్చింతల్ ఆశ్రమంలోని శ్రీరామానుజ స్వామి సహస్రాబ్ది సమారోహంతో పాల్గొనడంతో పాటు పటాన్ చెరులోని ఇక్రిశాట్ లో జరిగే కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం, ఢిల్లీకి తిరిగి వెళ్ళేటప్పుడు వీడ్కోలు పలుకనున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ . ప్రధాని రాక సందర్భంగా ముచ్చింతల్​లో 8 వేల మంది పోలీసులతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటుచేశారు.

శ్రీరామానుజ సహస్రాబ్ది సమరోహ ఉత్సవాల్లో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. 216 అడుగుల రామానుజచార్యుల పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్​లో ముచ్చింతల్​కు చేరుకోనున్న ప్రధాని…దాదాపు 3 గంటలపాటు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో పర్యటించనున్నారు.

తొలుత యాగశాలలో విష్వక్సేనుడి ఇష్టి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో నిర్మించిన 108 దివ్యదేశాలను.. ఆతర్వాత 120 కిలోల శ్రీరామానుజ స్వర్ణ మూర్తిని సందర్శించనున్నారు. భద్రవేదిపైనున్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటిని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు మోదీ.3డీ మ్యాపింగ్ వీక్షించి.. వేద పండితుల ఆశీర్వచనం అందుకుని.. రాత్రి 8.20 గంటలకు శంషాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.

- Advertisement -