బీజేపీ అంటేనే కోతలు.. బండి, గుండులపై మంత్రి హరీష్ కామెంట్స్..

42
- Advertisement -

బీజేపీ అంటేనే కోతలు.. కోతలు తప్ప ఏం లేదు.. అని మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆయన ఆలేరు నియోజకవర్గ యువజన విద్యార్థి సోషల్ మీడియా విభాగం సమావేశానికి ముఖ్య అథితిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు.. బీజేపీ ఫేక్ వాట్సప్ ప్రచారం చేస్తున్నదని.. యువత బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. ఏ అంశంలో చూసినా తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. కానీ బీజేపీ నేతలు జూటా మాటలు మాట్లాడుతున్నారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉంది. డబుల్ ఇంజన్ గ్రోత్ అని చెప్పుకునే వాళ్ల యూపీ అట్టడుగున ఉందన్నారు.

ఇక్కడి బండి, గుండు మాటలు చెప్పుమంటే కోటలు దాటుతయి. మేం అడ్డుకుంటే ఒక్కరు కూడా బయట తిరుగలేరని హెచ్చరించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని మేమంటే.. 7 లక్షల ఉద్యోగాలే ఖాళీ ఉన్నాయి అంటరు. కనీసం ఇదన్న ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. కానీ అవి కాకుండా రైల్వే, బ్యాంకుల్లో, డిఫెన్స్ లో ఇంకా ఉన్నాయి. అన్ని 15 లక్షల ఉద్యోగాలు నింపుమని ఢిల్లీలో బిలియన్ మార్చ్ చేయు బండి సంజయ్ నీకు దమ్ముంటే…అని ధ్వజమెత్తారు.

రాజ్యాంగం గురించి సీఎం కేసీఅర్ ఏం తప్పు మాట్లాడారు.. అంబేడ్కర్ గారే చెప్పారు.. నేను రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారనీ, అవసరం అయితే రద్దు చేయాలి అని.. దేశంలో రాజ్యాంగ స్ఫూర్తి పోతున్నది న్యాయం చేయాలి అంటున్నాం. జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు పెంచాలి అంటే పట్టించుకోరు. బీజేపీ అంటేనే కోతలు.. కోతలు తప్ప ఏం లేదు.. 5 రాష్ట్రాల ఎన్నికలు కాగానే వాతలు పెడుతారు..పెట్రో డీజిల్ గ్యాస్ ధరలు పెంచడానికి సిద్దంగా ఉన్నరు మంత్రి తెలిపారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒకటన్న ఉన్నదా..కేంద్రం తెలంగాణను చిన్న చూపు చూస్తున్నది. ఇక్కడి బీజేపీ నేతలకు నైతికత లేదు..వాళ్ళే నలుగురు వస్తరు.. వాళ్ళే కొట్టుకుంటరు.. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తారు.. ముల్లును ముల్లు తోనే తీయాలి.. అంత కంటే గట్టి సమాధానం చెప్పాలి.. తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా తిప్పి కొట్టాలి అని మంత్రి హరీష్‌ పేర్కొన్నారు..

- Advertisement -