- Advertisement -
పేద మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిచాలనే సదుద్దేశంతో హై లైఫ్ సూపర్ స్పెషల్టీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శివ మోహన్ రెడ్డి తెలిపారు. మియాపూర్ లోని మాతృ శ్రీ నగర్ నూతనంగా ఎర్పాటు చేసిన హై లైఫ్ హాస్పిటల్ ని రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శివ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం తో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాని హై లైఫ్ అందిచనున్నట్లు తెలిపారు. అన్ని రకాలుగా వైద్య పరీక్షలతో పాటు శస్త్రచికిత్స అందిస్తామని 150 పడకలు అందుబాటులో ఉన్నాయని ఎండీ తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ. ఎమ్మెఎల్సీ నవీన్ రావు. కార్పొరేటర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -