చిరుతో మాళవిక..!

105
malavika
- Advertisement -

వరుస సినిమాలతో ఈ ఏడాది అలరించేందుకు సిద్ధమవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం చిరు నటించిన ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉండగా తర్వాత లైన్‌లో గాడ్ ఫాదర్, భోళా శంకర్ వంటి చిత్రాలున్నాయి. ఇక వీటి తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమా చేయనున్న చిరు….తర్వాత వెంకీ కుడుముల సినిమా చేయనున్నాడు.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష నటించబోతుందని ఆ తర్వాత శృతి హాసన్ హీరోయిన్‌గా నటించబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు మాళవిక మోహన్‌ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

ఇక చిరు నటించిన ఆచార్య…ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది.

- Advertisement -