రాష్ట్రంలో భూముల విలువ పెంపు..

46
ts
- Advertisement -

ఫిబ్రవరి 1 నుండి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్, భూముల విలువను సవరించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సవరించిన రేట్లను ఖరారు చేసింది ప్రభుత్వం. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ 50 శాతం, ఖాళీ స్థలాలు 35 శాతం, అపార్ట్‌మెంట్ ఫ్లాట్ విలువ 25-30 శాతం పెంచుతూ రిజిస్ట్రేషన్‌ల శాఖ నిర్ణయం తీసుకుంది.

వాణిజ్య సముదాయాల్లో అన్ని ఫ్లోర్‌లకు ఒకే మార్కెట్‌ విలువను అధికారులు నిర్ణయించారు. స్థలాల విలువల సగటు 35 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సుదీర్ఘ సమీక్ష అనంతరం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ప్రతిపాదనలను జిల్లా రిజిస్ట్రార్లకు పంపింది.

- Advertisement -