- Advertisement -
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా ‘ఏటీఎమ్ రాబరీ’ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. ఈ సిరీస్‌కు దర్శకుడు హరీశ్ శంకర్ కథను అందిస్తున్నారు. జీ5 సంస్థతో కలిసి ఈ సిరీస్‌ను నిర్మించబోతున్నట్టు ఈరోజు దిల్ రాజు ప్రకటించారు. ఈ సిరీస్‌కు చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, హరీశ్ శంకర్ కాంబినేషన్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఇక ఇటీవల విడుదలైన ‘రౌడీ బాయ్స్’ మూవీ ద్వారా తన సోదరుడి కుమారుడు ఆశిష్‌ను దిల్ రాజు వెండితెరకు పరిచయం చేశారు. ఆ సినిమా ప్రమోషన్ సమయంలోనే ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా అడుగులు వేయాల్సి ఉంటుందని వెబ్ సిరీస్ గురించి పరోక్షంగా దిల్ రాజు వెల్లడించారు.
- Advertisement -