గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కరోనా

153
balayogi
- Advertisement -

తూర్పుగోదావరిజిల్లా, అమలాపురం అల్లవరం మండలం గోడి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కరోనా సోకింది. హాస్టల్ లో చదువుతున్న తొమ్మిది మంది విద్యార్థులకు కరోనా గా తేలడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

తీవ్ర జ్వరం తో బాధపడుతున్న మరికొందరు విద్యార్థులను గమనించి , ఇంటికి పంపివేసిన హాస్టల్ సిబ్బంది తీరు వివాదస్పదంగా మారింది. కరోనా సోకిన వారితోపాటు అనుమానం ఉన్న మరో 40 మంది విద్యార్థులను కూడా హాస్టల్ సిబ్బంది ఇంటికి పంపేశారు. హాస్టల్ లో ఉన్న 450 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేసేందుకు వైద్య సిబ్బంది ని రప్పించారు.

- Advertisement -