- Advertisement -
రాష్ట్ర వ్యాప్తంగా 56 వేల పడకలు ఏర్పాటు చేసి కరోనా కేసులలో వస్తున్న రోగులకు సత్వర వైద్యం చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈరోజు ఆయన జ్వర సర్వేలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటికీ ఫీవర్ సర్వే చేసి ప్రభుత్వం ద్వారా ఉచిత మెడికల్ కిట్ లను అందిస్తున్నాం. ఎవరూ కార్పోరేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దు, ప్రభుత్వం అందరికీ ఆరోగ్య భరోసా కల్పిస్తుతుంది. కరోనా కల్లోలానికి ప్రజలు అధైర్య పడవద్దు, ప్రభుత్వం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవాలి, అనుమానం ఉంటే హోమ్ ఐసోలేషన్ కిట్ వాడాలి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశామన్నారు మంత్రి.
- Advertisement -