- Advertisement -
కరోనా, ఓమిక్రాన్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింట జ్వర సర్వే కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి పట్టణ 23వ వార్డు నందు జరుగుతున్న కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వార్డులోని ఇండ్లకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధికారులతో కలసి వెళ్లి స్వయంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇంటి, ఇంటికి వెళ్లి జ్వర సర్వే సమర్థవంతంగా నిర్వహించాలని లక్షణాలు ఉన్న వారిని తక్షణమే గుర్తించి వారికి మందులను, సూచనలు చేయాలని అశా వర్కర్లకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు.
- Advertisement -